చింత చిగురు కోసిన రఘువీరారెడ్డి.. వీడియో ఇదిగో
- సొంత గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటోన్న రఘువీరా
- చింత చిగురు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ట్వీట్
- పప్పు చేయించుకొని తినాలనిపించిందని వ్యాఖ్య
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. సత్యసాయి జిల్లా నీలకంఠా పురంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. ఆయన ఓ రైతులా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. తాజాగా ఆయన గ్రామస్థులతో కలిసి చింత చిగురు కోశారు.
తమ తోటలో మంచి చింతచిగురు చూసి తన చిన్నతనంలోని అనుభవాలు గుర్తు కొచ్చాయని చెప్పారు. నా చిన్నతనంలో అమ్మ నరసమ్మ అలా నడుచుకుంటూ వెళ్లి మా తోటలో చింతచిగురు కోసుకొచ్చి పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి. తోటలో చిగురు కోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించింది అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
రఘువీరారెడ్డి తన తోటలో పనులు చేస్తూ ట్విట్టర్ ఖాతాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్టు చేస్తుంటారు. తన మనవరాలి క్యూట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటారు. తెల్లగడ్డంతో సాధారణ రైతులా ఆయన కనపడుతోన్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.