కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. కొత్త కేసులు ఎన్నంటే..!

  • మొన్నటిదాకా 3 వేలకుపైనే కేసులు
  • తాజాగా 2,568 మందికి పాజిటివ్
  • యాక్టివ్ కేసులు 19,137
  • అంతకుముందు రోజుతో పోలిస్తే 363 తగ్గుదల
దేశంలో కరోనా కేసులు ఓ రోజు తక్కువ.. మరో రోజు అంతకుమించి నమోదవుతున్నాయి. హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వస్తున్నాయి. కొన్ని రోజులుగా 3 వేలకు పైగానే నమోదైన కరోనా కేసులు తాజాగా.. దిగివచ్చాయి. నిన్న 2,568 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 4,30,84,913కి పెరిగింది. కరోనాకు మరో 24 మంది బలవగా.. మొత్తంగా చనిపోయిన వారి సంఖ్య 5,23,889కి చేరింది. 

యాక్టివ్ కేసులు 19,137 ఉన్నాయి. 24 గంటల్లో యాక్టివ్ కేసులు 363 తగ్గాయి. మరో 2,911 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887కి పెరిగింది. రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉండగా.. వారం మొత్తం నమోదైన కేసులకు సంబంధించి సగటు పాజిటివిటీ రేటు 0.71 శాతం ఉంది. కాగా, ఇప్పటిదాకా 189.41 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను జనానికి వేశారు.


More Telugu News