అమెజాన్ ప్రైమ్ లో 'ఆచార్య'?
- క్రితం నెల 29వ తేదీన వచ్చిన 'ఆచార్య'
- బలహీనమైన కథాకథనాలే మైనస్
- ఇతర పాత్రల్లో బలంగా లేకపోవడం మరో కారణం
- ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో పలకరించే ఛాన్స్
చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రధారులుగా రూపొందిన 'ఆచార్య' క్రితం నెల 29వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే కథాకథనాల విషయంలోను .. సంభాషణల విషయంలోను ఎక్కడా కొరటాల మార్కు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వీకెండ్ లోనే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారు ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టుగా సమాచారం.
ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. తిరు ఫొటోగ్రఫీ కూడా అదనపు బలంగా నిలిచింది. చిరంజీవి - చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడం, పూజ హెగ్డే .. సోనూ సూద్ .. అజయ్ .. వెన్నెల కిశోర్ .. తనికెళ్ల భరణి పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం ప్రేక్షకులను నిరాశకు లోనుచేసింది.