రాజస్థాన్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేసిన కోల్ కతా బౌలర్లు
- వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
- 152 పరుగులు చేసిన రాజస్థాన్
- సంజు శాంసన్ అర్ధసెంచరీ
ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. భారీ హిట్టర్లు ఉన్న రాజస్థాన్ జట్టును కోల్ కతా బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. టిమ్ సౌథీ 2 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 1, అనుకూల్ రాయ్ 1, శివం మావి 1 వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 పరుగులు చేయగా, ఆఖర్లో షిమ్రోన్ హెట్మెయర్ వేగంగా ఆడడంతో రాజస్థాన్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. హెట్మెయర్ 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.