మహిళలపై అఘాయిత్యాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు: మంత్రి ఆదిమూలపు సురేశ్
- రేపల్లెలో అత్యాచార ఘటన
- బాధితురాలికి ఒంగోలు రిమ్స్ లో చికిత్స
- రిమ్స్ వద్దకు వచ్చిన మంత్రి ఆదిమూలపు
- బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి
రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారానికి గురైన బాధితురాలు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని బీహార్ తో పోల్చుతూ ప్రతిపక్షాలు దారుణంగా విమర్శిస్తున్నాయని అన్నారు. రేపల్లె అత్యాచార ఘటన బాధితురాలికి తాము న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ విపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఆదిమూలపు హితవు పలికారు.
కాగా, బాధితురాలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన మహిళ కావడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించినట్టు మంత్రి వెల్లడించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.