తెలుగు సినిమా తన సత్తాను ఇప్పుడు చాటుకోవడమేంటి? : తమ్మారెడ్డి భరద్వాజ

  • ఆనాటి సినిమాలు కొత్త రికార్డులు సృష్టించాయన్న తమ్మారెడ్డి భరద్వాజ
  • అప్పటి టిక్కెట్ల రేటువేరు .. ఆ వసూళ్లు వేరు అంటూ వ్యాఖ్య 
  • ఇప్పటి రేట్లతో పోల్చుకుంటే అవి భారీ వసూళ్లే అంటూ వివరణ 
  • బాలీవుడ్ వాళ్లతో పోల్చుకోవడం ఎందుకంటూ అసహనం
సౌత్ ఇండియా నుంచి ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు వస్తున్నాయి .. భారీ వసూళ్లను రాబడుతున్నాయి.  దాంతో తెలుగు సినిమా తన సత్తాను చాటుకుంటోందనే అభిప్రాయాన్ని కొంతమంది ప్రముఖులు వ్యక్తం చేయడం పట్ల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజా ఇంటర్వ్యూలో అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
"తెలుగు సినిమా ఇప్పుడు తన సత్తా చాటుకోవడమేంటి? నా చిన్నప్పుడే అది తన సత్తా చాటుకుంది. చరిత్ర తెలియకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పటి వసూళ్లతో పోల్చుకుంటే 'అడవిరాముడు' 700 కోట్లు వసూలు చేసినట్టని మొన్న ఎవరో అన్నారు. అప్పటి వసూళ్లను ఈ నాటి టిక్కెటు రేట్లతో పోల్చుకుంటే, 'లవకుశ' .. 'మూగమనసులు' వేలకోట్లను రాబట్టినట్టు అవుతుంది.

సౌత్ ఇండియా నుంచి రెహ్మాన్ ఆస్కార్ అవార్డు తీసుకుని వచ్చాడు. రసూల్ పూకుట్టి కూడా తీసుకొచ్చాడు .. ఆయన కూడా సౌత్ ఇండియన్ నే కదా. ఇండియన్ సినిమా స్పాన్ పెంచిన శంకర్ సౌత్ ఇండియన్ నే కదా? మరి మనవాళ్ల దగ్గర ఇంత విషయం పెట్టుకుని బాలీవుడ్ వాళ్లతో పోల్చుకోవడమే నాకు బాధ కలిగిస్తుంది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News