అస్వస్థతతో ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి... ఆందోళనలో అభిమానులు

  • ఆసుపత్రి బెడ్ పై మిథున్ చక్రవర్తి
  • ఫొటో వైరల్
  • స్పందించిన మిథున్ కుమారుడు మిమో చక్రవర్తి
  • స్వల్ప శస్త్రచికిత్స జరిగిందని వెల్లడి
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిథున్ చక్రవర్తి ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడమే అందుకు కారణం. అసలేమైందో తెలియక ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. 

ఈ నేపథ్యంలో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి స్పందించారు. కిడ్నీలో రాళ్లు ఉండడంతో తన తండ్రి నొప్పితో బాధపడ్డారని, అందుకే ఏప్రిల్ 30న ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.


More Telugu News