నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 84 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 33 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లను పెంచబోతోందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. 

ఈ క్రమంలో ఒకానొక సమయంలో భారీ నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత కోలుకుని చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 56,975కి పడిపోయింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 17,069 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.17%), ఎన్టీపీసీ (2.54%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.20%), టాటా స్టీల్ (1.84%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.55%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-2.95%), విప్రో (-2.74%), టెక్ మహీంద్రా (-1.87%), ఇన్ఫోసిస్ (-1.70%), ఏసియన్ పెయింట్స్ (-1.27%).


More Telugu News