దేశంలో కొత్తగా 3,157 కేసుల నమోదు .. అప్డేట్స్ ఇవిగో!

  • ఢిల్లీలో అత్యధికంగా 1,485 కేసులు
  • దేశ వ్యాప్తంగా 26 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 19,500
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కాస్త హెచ్చు తగ్గులతో ప్రతి రోజు 3 వేలకు పైగా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 3,157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో ఢిల్లీలో అత్యధికంగా 1,485 కేసులు నమోదయ్యాయి. హర్యానాలో 479 కేసులొచ్చాయి. తర్వాతి స్థానాల్లో కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 86 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. 

మరోవైపు గత 24 గంటల్లో 26 మంది కరోనా కారణంగా చనిపోగా... 2,723 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,500కు చేరింది. ఇప్పటి వరకు 189 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 4.02 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.


More Telugu News