'ఘోస్ట్ ఆఫ్ కీవ్' అంటే ఒక వ్యక్తి కాదట.. క్లారిటీ ఇచ్చిన ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్
- 40 రష్యా యుద్ధ విమానాలను స్టెఫాన్ తారాబల్కా కూల్చేశారంటూ ప్రచారం
- ఘోస్ట్ ఆఫ్ కీవ్ అంటూ కీర్తిస్తున్న ప్రపంచం
- ఘోస్ట్ ఆఫ్ కీవ్ అంటే సుశిక్షితులైన పైలట్ల బృందమన్న ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్
ఉక్రెయిన్ యుద్ధ విమాన పైలట్, 'ఘోస్ట్ ఆఫ్ కీవ్' స్టెఫాన్ తారాబల్కా (29) పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంపై రష్యా దండయాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి స్టెఫాన్ శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలపై విరుచుకుపడ్డాడని... 40 ఫైటర్ జెట్లను కూల్చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు... ఆయన మృతి చెందాడనే వార్తలు మీడియాను హోరెత్తించాయి. ఆయన మరణ వార్తతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆవేదనకు గురయ్యారు.
అయితే 'ఘోస్ట్ ఆఫ్ కీవ్' గురించి ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది. ఘోస్ట్ ఆఫ్ కీవ్ అంటే ఒక వ్యక్తి కాదని... అత్యంత సుశిక్షితులైన పైలట్ల బృందం 'టాక్టికల్ ఏవియేషన్ బ్రిగేడ్'కు పెట్టిన పేరు అదని వెల్లడించింది.
మరోవైపు స్టెఫాన్ తారాబల్కా 40 యుద్ధ విమానాలను కూల్చలేదని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం సాధించిన విజయాలను ఏ ఒక్కరికో ఆపాదించకుండా... అందరి సమష్టి విజయంగా చూడాలని చెప్పింది. సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ముందు దాని గురించి పక్కాగా తెలుసుకోవాలని సూచించింది. స్టెఫాన్ తారాబల్కా మార్చి 13న మరణించారని స్పష్టతనిచ్చింది. స్టెఫాన్ యుద్ధ వీరుడని... ఆయన ఘోస్ట్ కాదని తెలిపింది.