ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు: కిష‌న్ రెడ్డి

  • టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదన్న కిష‌న్ రెడ్డి
  • నిరుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేవని వ్యాఖ్య‌
  • రుణ మాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేర‌ని విమ‌ర్శ‌
  • దళితులకు మూడెకరాల భూమి లేద‌ని కౌంట‌ర్
తెలంగాణ ప్ర‌భుత్వంపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత..' అని కేటీఆర్ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇస్తున్న‌ట్లుగా కిష‌న్ రెడ్డి చేసిన ట్వీట్ ఉంది.  

'టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేవు, రుణ మాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు, పంట నష్ట పరిహారం లేదు, దళితబంధు లేదు, బీసీ బంధు అసలే లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు. 
 
అప్పులకు కొదవ లేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు, సామాజిక న్యాయం లేదు, సచివాలయం లేదు, సీఎం ప్రజలను కలిసేది లేదు, ఉద్యమ కారులకు గౌరవం లేదు, విమోచన దినోత్సవం జరిపేది లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు' అని కిష‌న్ రెడ్డి చుర‌క‌లంటించారు.


More Telugu News