బీజేపీ నేత శ్వేతాసింగ్ హత్యకేసులో వీడిన మిస్టరీ.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ను దాచిపెట్టేందుకు భర్తే హత్య చేసిన వైనం!
- గత బుధవారం ఇంట్లో సీలింగుకి వేలాడుతూ కనిపించిన శ్వేతాసింగ్
- ఆమె భర్త దీపక్‌సింగ్‌కు అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌తో సంబంధాలు
- అమ్మాయిల కోసం బ్రోకర్లతో సంప్రదింపులు జరుపుతున్న ఆడియోలు వెలుగులోకి
- భర్త కుటుంబ సభ్యులపై హత్యకేసు నమోదు
- దీపక్ సింగ్ అరెస్ట్.. పరారీలో మరో నిందితుడు
గత బుధవారం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన ఉత్తరప్రదేశ్‌లోని బాండాకు చెందిన బీజేపీ నేత శ్వేతాసింగ్ గౌర్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు బయటపడిపోతుందన్న ఉద్దేశంతో భర్తే ఆమెను హత్య చేసినట్టు శ్వేతాసింగ్ రికార్డు చేసిన తన భర్త కాల్ రికార్డుల ద్వారా వెల్లడైంది.
తనకు ప్రాణహాని ఉందన్న భయంతో శ్వేత రుజువుగా ఉంటాయని భావించి తన భర్త ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించారు. శ్వేత కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమె భర్త దీపక్ సింగ్ గౌర్, ఆయన తల్లిదండ్రులు, సోదరుడిపై హత్య కేసు పెట్టారు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రష్యన్, మొరాకో, ఆఫ్రికన్ అమ్మాయిల కోసం శ్వేతాసింగ్ భర్త దీపక్ సింగ్ బ్రోకర్లతో సంప్రదింపులు జరిపారు. ఆయనకు అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు ఇది నిరూపిస్తోంది. శ్వేత తన మరణానికి ముందు తన భర్త ఫోన్ కాల్స్ రికార్డింగుల గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపారు. రష్యాలోని సెక్స్ వర్కర్లతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దాచిపెట్టేందుకు దీపక్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె సోదరుడు రితురాజ్ ఆరోపించారు.
ఓ ఆడియో రికార్డింగులో రష్యన్ అమ్మాయిలను సరఫరా చేసే వ్యక్తితో మాట్లాడుతూ.. ‘నేను బాండా నుంచి వచ్చాను. సునీల్ సింగ్ గౌతమ్ మీ నంబరు ఇచ్చారు. ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు నన్ను హోటల్‌కి పంపిస్తారా? లేదంటే నేనే రావాల్సి ఉంటుందా?' అని ప్రశ్నించారు. అంతేకాదు, మీ వద్ద రష్యన్, ఆఫ్రికన్ అమ్మాయిలు కూడా ఉన్నారా? అని అడగడం కూడా ఆ ఆడియోలో వినిపించింది. వారి ఫొటోలు, రేట్లు పంపిస్తే వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పారు.
మరో ఆడియో క్లిప్‌లో.. బ్రోకర్ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించమంటున్నారని, కానీ తాను నగదు చెల్లిస్తానని చెప్పారు. ఇంకో ఆడియోలో.. రూ. 20 వేలకు ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు రష్యన్, మరొక ఇండియన్ యువతులను పంపాలని కోరారు. చివరికి ఒక రష్యన్, మరో మొరాకో అమ్మాయి కోసం రూ. 23 వేలకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. మరో ఆడియోలో దీపక్ ఓ రష్యన్ అమ్మాయిని అడగ్గా బ్రోకర్ మాత్రం తన వద్ద మొరాకో అమ్మాయి మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు దీపక్.. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి ఒక ఇండియన్ అమ్మాయి కూడా కావాలని కోరారు. ఈ సంభాషణ చాలాసేపు నడిచింది.
అనంతరం దీపక్.. తాను లక్నోలోని నాకా హిందోళ ప్రాంతంలో ఉన్న ఎంజే ఇంటర్నేషనల్ హోటల్‌లో ఉన్నట్టు చెప్పారు. అక్కడికే ఇద్దరు అమ్మాయిలను పంపాలని కోరారు. కాగా, దీపక్ సింగ్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంధించి పలు వీడియోలు కూడా అందుకున్నట్టు ఎస్పీ అభినందన్ చెప్పారు. అన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.