ఉస్మానియా వర్సిటీకి రాహుల్ గాంధీ వెళ్లి తీరతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఈ నెల 6న తెలంగాణకు రాహుల్
- కాంగ్రెస్ అగ్రనేత రాకముందే ఉద్రిక్తతలు
- ఓయూలో పర్యటనకు అనుమతి నిరాకరణ
- విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్
- కలిసేందుకు వెళ్లిన జగ్గారెడ్డి కూడా అరెస్ట్
- భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందే వాడివేడి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉస్మానియా వర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టగా, పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన విద్యార్థి సంఘాల నేతలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీకి వెళ్లి తీరతారని స్పష్టం చేశారు. ఓ సాధారణ ఎంపీలా, ఓ సామాన్య పౌరుడిలా రాహుల్ ఓయూకి వెళతారని తెలిపారు. ఓయూని కేసీఆర్ తన సొంత జాగీరులా భావిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని, ఉస్మానియా వర్సిటీ నిజాం నిర్మించిన విద్యా సంస్థ అని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. బంజారాహిల్స్ పీఎస్ లో జగ్గారెడ్డిని కలిసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.