రాహుల్ గాంధీ ఓయూకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?: రేవంత్ రెడ్డి
- తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
- ఈ నెల 6న హైదరాబాద్ రాక
- 7వ తేదీన ఉస్మానియా వర్సిటీలో పర్యటన
- అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
ఈ నెల 6వ తేదీ సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు. అయితే, మే 7వ తేదీన రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించాల్సి ఉండగా, ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. రాహుల్ పర్యటనకు వస్తుంటే కేసీఆర్ హడలిపోతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడు అని, మరో పన్నెండు నెలల్లో ఆయన పాలన ముగియనుందని అన్నారు. రాహుల్ గాంధీ ఓయూకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
"రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై విద్యార్థి సంఘాలు నిరసన తెలిపితే వారిని అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘాల వారిని కలిసేందుకు జగ్గారెడ్డి వెళితే ఆయనను కూడా అరెస్ట్ చేయడం దారుణం. అందరినీ వెంటనే విడుదల చేయాలి" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.