రేపల్లె అత్యాచార బాధితురాలిని ఒంగోలు తరలించిన పోలీసులు... పరామర్శించేందుకు టీడీపీ నేతల యత్నం
- రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం
- మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలింపు
- ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకువచ్చిన అధికారులు
- టీడీపీ నేతలను గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు
రేపల్లె రైల్వే స్టేషన్ లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో మహిళా వలస కూలీపై సామూహిక అత్యాచారం జరగడం తెలిసిందే. కాగా, అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ప్రత్యేక అంబులెన్స్ లో పోలీసు భద్రత నడుమ ఒంగోలు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, ఆర్డీవో, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఒంగోలు రిమ్స్ కు వచ్చారు. బాధితురాలిని ఒంగోలుకు తరలించారన్న సమాచారంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రిమ్స్ కు చేరుకున్నారు.
కాగా, కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, ఇతర టీడీపీ నేతలు పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు టీడీపీ నేతలను రిమ్స్ మెయిన్ గేటు వద్దే అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.