దుమ్మురేపిన టాపార్డర్... లక్నో భారీ స్కోరు
- వాంఖెడే స్టేడియంలో లక్నో వర్సెస్ ఢిల్లీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
- కేఎల్ రాహుల్, దీపక్ హుడా అర్ధసెంచరీలు
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 రన్స్ చేసిన లక్నో
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ సత్తా చాటింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా అర్ధసెంచరీలతో రాణించగా, లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశాడు. చివర్లో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 17 పరుగులు సాధించాడు. లక్నో కోల్పోయిన మూడు వికెట్లు మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి చేరాయి.