సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదు: చిరంజీవి ఆవేదన
- నేడు మేడే
- హైదరాబాదులో సినీ కార్మికోత్సవం
- హాజరైన కిషన్ రెడ్డి, చిరంజీవి
- సినీ రంగానికి ప్రభుత్వాల సహకారం కావాలన్న చిరంజీవి
ఇవాళ మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ యూసుఫ్ గూడ కేవీఆర్ మైదానంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. తెలుగు ఫిల్మ్ ఫెడేరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికులు ఎన్నో బాధలను దిగమింగి పనిచేస్తారని వెల్లడించారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వేళ కార్మికులకు నిత్యావసరాలు ఇవ్వడం బాధ్యతగా భావించానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు కలిసి ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం కావాలని అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎంతో భరోసానిచ్చారని కొనియాడారు.