బౌలర్ క్రీజు దాటలేదు.. బంతి నడుము ఎత్తులోనూ రాలేదు.. నో బాల్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. కారణం ఎంసీసీలోని ఈ రూలే!
- శుభ్ మన్ గిల్ ను అవుట్ గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్
- థర్డ్ అంపైర్ కు నివేదించుకున్న గిల్
- నాటౌట్ అని తేలిన వైనం
- కీపర్ చేతులు బంతి పడకముందే వికెట్ల ముందుకు
- 27.3 రూల్ ప్రకారం నో బాల్ గా ప్రకటన
బౌలర్ క్రీజు దాటలేదు.. బంతి బ్యాటర్ నడుము ఎత్తు దాటి రాలేదు.. అలాగని ఒకే ఓవర్ లో రెండో బౌన్సర్ కూడా కాదు.. కానీ, థర్డ్ అంపైర్ నో బాల్ అని ప్రకటించాడు. ఇదీ ఇన్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నో బాల్ వివాదం. అవుటని ఫీల్డ్ అంపైర్ ప్రకటించడం.. దాన్ని శుభ్ మన్ గిల్ డీఆర్ఎస్ కు సవాల్ చేయడం చకచకా జరిగిపోయాయి. రీప్లేలో అవుట్ కాదని తేలింది.. అదే సమయంలో థర్డ్ అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. కారణమేంటి?
అది తెలియాలంటే ఐసీసీలోని ఓ రూల్ గురించి తెలుసుకోవాలి. మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ లోని 27.3 నిబంధనే ఆ బంతిని థర్డ్ అంపైర్ నోబాల్ గా ప్రకటించేందుకు కారణమైంది. ఆ నిబంధన ప్రకారం వికెట్ కీపర్ బంతి పడే వరకు తన పొజిషన్ లోనే ఉండాలి. కానీ, బంతి పడకముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సబ్ స్టిట్యూట్ కీపర్ .. తన చేతులను వికెట్ల ముందు దాకా తీసుకొచ్చాడు. అది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం.
కీపర్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న అంపైర్ నోబాల్ గా ప్రకటించవచ్చు. అయితే, శుభ్ మన్ గిల్ విషయంలో మాత్రం లెగ్ అంపైర్ నో బాల్ ప్రకటించలేదు. అయితే, బ్యాట్ టచ్ కాకపోయినా అంపైర్ అవుటివ్వడం, గిల్ రిఫరల్ తీసుకోవడం.. రూల్స్ ను గమనించిన థర్డ్ అంపైర్ నో బాల్ గా ప్రకటించడం జరిగిపోయాయి. కాగా, థర్డ్ అంపైర్ నోబాల్ గా ప్రకటించగానే విరాట్ కోహ్లీ అంపైర్ తో వాదనకు దిగిన సంగతి తెలిసిందే.