నవ రత్నాలు కాదు.. నవ మోసాలు: యనమల
- జగన్ పాలన 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోంది
- మూడేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం జగన్‌ది
- సంక్షేమ పథకాలను అవినీతిమయం చేశారన్న యనమల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆయన చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది నవ రత్నాలు కాదని, నవ మోసాలని ఆయన అన్నారు.
జగన్ పాలన 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోందని ఆయన చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం జగన్ దేనని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను అవినీతిమయం చేశారని ఆయన ఆరోపించారు. హామీలు అమలు చేయని జగన్ పై గ్రామగ్రామాన చర్చ జరుగుతోందని ఆయన విమర్శించారు.