ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తెరిచారా..?
- డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు
- ఈ ఖాతాలో భద్రంగా ఉంచుకోవచ్చు
- ఎక్కడ ఉన్నా సులభంగా పొందొచ్చు
- వైద్యులకు షేర్ చేసుకోవచ్చు
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఏబీహెచ్ఏ)ను నేషనల్ హెల్త్ అథారిటీ 2021లో ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తికి సంబంధించిన హెల్త్ రికార్డులన్నింటినీ డిజిటల్ రూపంలో దాచుకునే వేదికే ఏబీహెచ్ఏ. బ్యాంకు ఖాతా మాదిరే దీన్ని కూడా భావించొచ్చు.
ఏబీహెచ్ఏ అంటే..ఇదొక ప్రత్యేకమైన హెల్త్ ఐడీ. ప్రతి వ్యక్తికి వేర్వేరుగా.. 14 నంబర్లతో ఉంటుంది. ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్ సాయంతో దీన్ని ఆన్ లైన్ లోనే సులభంగా తీసుకోవచ్చు. ఇందులో తమ వ్యక్తిగత ఆరోగ్య పత్రాలన్నింటినీ జాగ్రత్త పరుచుకోవచ్చు.
ఏబీహెచ్ఏ వల్ల ఉపయోగాలు..
ఈ ఖాతాలో మీ హెల్త్ రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటాయి. ఉదాహరణకు డాక్టర్ రాసిచ్చిన మందుల పత్రం, వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు, ఆరోగ్య చరిత్ర అన్నీ ఉంటాయి. కనుక ఎక్కడ ఉన్నా డిజిటల్ రూపంలో సులభంగా పొందొచ్చు. అంతే కాకుండా ఈ ఖాతా నుంచి ఆయా పత్రాలను డిజిటల్ రూపంలో వైద్యులు, ఆసుపత్రులకు షేర్ చేసుకోవచ్చు. వెంట భౌతిక రూపంలో మెడికల్ ఫైల్ పట్టుకుని పోవాల్సిన అవస్థ తప్పుతుంది.
ఎలా తీసుకోవాలి..?
ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ ఉంటే సులభంగానే ఏబీహెచ్ఏ ఖాతా తెరవొచ్చు. ఇందుకోసం ఏబీహెచ్ఏ వెబ్ సైట్ కు వెళ్లాలి. ‘క్రియేట్ యువర్ ఏబీహెచ్ఏ నౌ’ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత ‘జనరేట్ వయా ఆధార్’ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. కింది భాగంలో అంగీకారాన్ని తెలిపి, క్యాపిచా నమోదు చేసి సబ్ మిట్ చేయాలి. ఆధార్ డేటా సెంటర్ నుంచి మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆ తర్వాత మరోసారి మొబైల్ నంబర్ ను కూడా నమోదు చేసి సబ్ మిట్ కొట్టాలి. అక్కడ మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. వాటిని ఓకే చేస్తే ఏబీహెచ్ఏ ఖాతా తెరుచుకుంటుంది. ఏబీహెచ్ఏ డిజిటల్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.