వాణిజ్య సిలిండర్ ధరలు పెరుగుదల
- 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.102.50 పెంపు
- హైదరాబాద్‌లో ఆ సిలిండర్ ధర రూ.2,562.50
- ఢిల్లీలో రూ.2,355.50, ముంబైలో రూ.2,329.50
దేశంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.102.50 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ఆ సిలిండర్ ధర రూ.2,562.50కి చేరింది. ఢిల్లీలో రూ.2,355.50, ముంబైలో రూ.2,329.50, కోల్‌కతాలో రూ.2,477.50, చెన్నైలో రూ.2,508కి వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. కాగా, ఢిల్లీలో ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655గా ఉంది. గత నెల 1న వాణిజ్య సిలిండర్‌పై రూ.268.50 చొప్పున పెంచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో రూ.102.50 పెరగడంతో 2 నెలల్లోనే రూ.372 పెరిగినట్లయింది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగకపోవడం గమనార్హం. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,002గా ఉండగా, కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, ఢిల్లీలో రూ.949.50, ముంబైలో రూ.949.50గా ఉంది.