మళ్లీ ధోనీకే పగ్గాలు ఇవ్వడంపై దిగ్గజాల అభిప్రాయాలు ఇవీ..
- ఇప్పటికీ మించిపోయింది లేదు
- వారు గెలిచే అవకాశాలున్నాయన్న సెహ్వాగ్
- జట్టులో ధోనీ ఉంటే కెప్టెన్ గా అతడే వ్యవహరించాలి
- మాజీ ఆల్ రౌండర్ అజయ్ జడేజా
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ గా రవీంద్ర జడేజా తప్పుకోవడంతో ఆ బాధ్యతలను తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకే ఇవ్వడం పట్ల క్రికెట్ దిగ్గజాలు స్పందించారు.
‘‘ధోనీ కెప్టెన్ గా లేకుంటే చెన్నైకు ఒరిగేది ఏమీ ఉండదంటూ మొదటి రోజు నుంచే చెబుతున్నా. మించిపోయింది లేదు. వారికి ఇప్పటికీ అవకాశాలున్నాయి. వారి చేతుల్లో ఇంకా మ్యాచ్ లు ఉన్నాయి. టర్న్ అరౌండ్ అవ్వొచ్చు’’అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
‘‘అతడ్ని (జడేజా) కెప్టెన్ గా ఎంపిక చేసినప్పుడు సరైన ఎంపిక కాదని భావించాను. ఇప్పుడు కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నారు. ధోనీ జట్టులో ఉన్నప్పుడు అతడే కెప్టెన్ గా ఉండాలి. భారత్ 2019 ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలోనూ నేను ఇదే చెప్పాను. జడేజా కూడా సంతోషంగానే ఉండి ఉండొచ్చు. అతడి భుజాలపై పెద్ద భారాన్నే మోపారు’’అని మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.
‘‘ఇర్ఫాన్ పఠాన్ అయితే జడేజా పట్ల సానుభూతి చూపించాడు. ఈ నిర్ణయం క్రికెటర్ గా జడేజాపై ప్రతికూల ప్రభావం చూపించదని అనుకుంటున్నాను’’అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. చెన్నై జట్టు 8 మ్యాచ్ లకు గాను కేవలం రెండింటిలోనే గెలిచి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. నేటి రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సీఎస్కే తలపడనుంది.