ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.. కాంస్యంతో సరిపెట్టుకున్న పీవీ సింధు
- టాప్ సీడ్ యమగుచితో జరిగిన పోరులో ఓటమి
- రిఫరీ తప్పిదంతో ఏకాగ్రత కోల్పోయిన సింధు
- చీఫ్ రిఫరీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
- బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ముగిసిన భారత షట్లర్ల పోరు
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21-13, 19-21, 16-21తో ఓటమి పాలైంది. దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. అయితే, 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సర్వీస్ ఆలస్యం చేస్తోందన్న కారణంతో సింధుకు రిఫరీ ఒక పెనాల్టీ పాయింట్ విధించాడు.
దీంతో రిఫరీతో వాదనకు దిగిన సింధు చీఫ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ ఘటన తర్వాత సింధు ఏకాగ్రత కోల్పోవడంతో ప్రత్యర్థి దానిని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత యమగుచి దూకుడు పెంచి వరుస సెట్లను గెలుచుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించిన యమగుచి 21-16తో గెలుచుకుని ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఓడిన సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. సింధు ఓటమితో బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పోరు ముగిసింది.