1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'కేజీఎఫ్ 2'

  • ' కేజీఎఫ్'తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్
  • మరింతగా పెరిగిపోయిన ప్రశాంత్ నీల్ క్రేజ్
  • సౌత్ లో వెయ్యికోట్లు రాబట్టిన మూడో సినిమా ఇది
  • 'కేజీఎఫ్ 3' ఉందని చెప్పిన ప్రశాంత్ నీల్ 
ఈ మధ్య కాలంలో ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమాగా 'కేజీఎఫ్ 2' కనిపిస్తుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పాన్  ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలి రోజునే రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత అదే జోష్ ను కొనసాగించింది. మొదటి భాగానికి మించిన వసూళ్లను సాధిస్తూ వెళుతోంది.

విడుదలైన 15 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం. దక్షిణాది నుంచి 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమా ఇది. తొలి రెండు స్థానాల్లో 'బాహుబలి 2' .. 'ఆర్ ఆర్ ఆర్' ఉన్నాయి. 'కేజీఎఫ్' తరువాత హీరోగా యశ్ క్రేజ్ ఎంతగా పెరిగిందో అంతకంటే ఎక్కువగా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఇమేజ్ పెరిగింది.

' కేజీఎఫ్ 2' థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకి ప్రశాంత్ నీల్ పై వాళ్లు పెట్టుకున్న నమ్మకం ప్రధానంగా కనిపిస్తుంది. మొదటి భాగానికి  ఎంతమాత్రం తగ్గకుండా రెండవ భాగం ఉండేలా చూసుకుని ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉందని చెబుతుండటం అందరిలోను ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.


More Telugu News