సీఎంలు, సీజేల స‌దస్సులో ఆమోదించిన తీర్మానాలు ఇవే

  • కోర్టుల నెట్‌వ‌ర్క్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధులు
  • కోర్టుల్లో మౌలిక స‌దుపాయాల‌ క‌ల్ప‌న‌
  • విశ్రాంత న్యాయ‌మూర్తుల ప్ర‌యోజ‌నాల బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దే
  • కోర్టుల అనుసంధానం త‌క్షణావ‌స‌ర‌మ‌న్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు నిర్వ‌హించిన స‌ద‌స్సులో ప‌లు కీల‌క తీర్మానాల‌కు ఆమోదం ల‌భించింది. ఈ విష‌యాన్ని సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స‌ద‌స్సు ముగింపు సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 

కోర్టుల్లో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాలన్న కీల‌క తీర్మానానికి స‌ద‌స్సు ఆమోదం తెలిపింద‌న్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌... విశ్రాంత న్యాయ‌మూర్తుల ప్ర‌యోజ‌నాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తి చేయాల‌న్న తీర్మానానికీ ఆమోదం ల‌భించిందని తెలిపారు. కోర్టుల్లో న్యాయ‌మూర్తుల నియామ‌కం, ఆన్‌లైన్ పోర్ట‌ల్‌పైనా చ‌ర్చ జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. కోర్టుల అనుసంధానం త‌క్ష‌ణం ప‌రిష్క‌రించ‌వ‌ల‌సిన స‌మ‌స్య‌గా స‌ద‌స్సు గుర్తించింద‌ని ఆయ‌న తెలిపారు. కోర్టుల నెట్‌వ‌ర్క్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలే నిధులు స‌మ‌కూర్చాల‌న్న తీర్మానానికి ఆమోదం ల‌భించింద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు.


More Telugu News