కోహ్లీ, పాటిదార్ అర్ధసెంచరీలు... బెంగళూరు 20 ఓవర్లలో 170-6
- గుజరాత్ వర్సెస్ బెంగళూరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
- ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
- దూకుడుగా ఆడిన మ్యాక్స్ వెల్
- సాంగ్వాన్ కు 2 వికెట్లు
మళ్లీ గెలుపు బాట పట్టాలన్న కసితో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. చాలారోజుల తర్వాత ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లీ (58), యువ ఆటగాడు రజత్ పాటిదార్ (52) రాణించడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది.
మ్యాక్స్ వెల్ కూడా ధాటిగా ఆడాడు. మ్యాక్స్ వెల్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో చకచకా 33 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2, షమీ 1, అల్జారీ జోసెఫ్ 1, రషీద్ ఖాన్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.