తెలుగు రాష్ట్రాల్లో 'ఆచార్య' తొలిరోజు వసూళ్లు!
- నిన్ననే విడుదలైన 'ఆచార్య'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా
- లైన్లో నే ఉన్న 'గాడ్ ఫాదర్' మూవీ
- ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను పలకరించనుంది
చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో రూపొందిన 'ఆచార్య' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూసూద్ నటించాడు.
తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోను తొలి రోజున ఈ సినిమా 33 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఒకరకంగా ఇది మంచి వసూళ్లేనని అంటున్నారు. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని సినిమా కావడం .. కొరటాలకి ఇంతవరకూ ఫ్లాప్ లేకపోవడం ఈ సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేరు వీరయ్య' ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. 'భోళా శంకర్'లో ఆయన సరసన తమన్నా అలరించనుండగా, 'వాల్తేరు వీరయ్య'లో శ్రుతి హాసన్ సందడి చేయనుంది. ఈ మూడింటిలో 'గాడ్ ఫాదర్' సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లకు రానుంది.