భాగ్యనగరంలో కరెంట్ లేదని బొత్స చేసిన మాటల్లో వాస్తవం లేదు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
- ఏపీని వైసీపీ నాశనం చేసిందన్న డీఎల్
- హైదరాబాద్‌లో కరెంట్ కోతలు లేవు
- రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందన్న డీఎల్
పొరుగు రాష్ట్రంలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయా పార్టీలకు చెందిన నేతలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. శుక్రవారం నాడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. ఏపీలోని పరిస్థితులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాల సత్యమని ఈ సందర్భంగా డీఎల్ అన్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్న డీఎల్... రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, ఆస్పత్రులు, అభివృద్ధి శూన్యమన్నారు. తన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటారన్న మాజీ మంత్రి...అక్కడ కరెంట్ కోతలు లేవన్నారు. భాగ్యనగరంలో కరెంట్ లేదని బొత్స చేసిన మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశమంతా విద్యుత్ కోతలున్నాయి గానీ... అప్రకటిత విద్యుత్ కోతలు ఏపీలోనే ఉండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందని డీఎల్ అన్నారు.