మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆట కాదు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

  • హైద‌రాబాద్‌కు వ‌చ్చిన అథవాలే
  • ఫ్రంట్‌లు ఎవరైనా ఏర్పాటు చేయొచ్చ‌ని వ్యాఖ్య‌
  • కేసీఆర్ త‌న‌కు మిత్రుడన్న కేంద్ర మంత్రి
2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర మంత్రి, రిప‌బ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రాందాస్ అథ‌వాలే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆటేమీ కాద‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మోదీకి వ్య‌తిరేకంగా ఎంద‌రు నేత‌లు రావాల‌నుకుంటున్నారో రండి అంటూ వ్యాఖ్యానించిన అథ‌వాలే.. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేను కేసీఆర్ క‌లిశారని, దానిపై ఎలాంటి అభ్యంత‌రం లేదన్నారు. ఫ్రంట్‌లు ఎవ‌రైనా ఏర్పాటు చేయొచ్చన్న కేంద్ర మంత్రి... తెలంగాణ‌కు స‌పోర్ట్‌గానే తాను ఇక్క‌డికి వ‌చ్చానన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేశారన్న అథ‌వాలే.. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ త‌న‌కు స్నేహితుడన్నారు. ద‌ళితుల‌పై జ‌రుగుతున్న‌దాడుల‌ను అరిక‌ట్టాల్సి ఉంద‌న్న ఆయ‌న‌... ద‌ళితుల‌కు 5 ఎక‌రాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


More Telugu News