సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
- వడ్ల కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావించిన సంజయ్
- తెలంగాణ సర్కారు అన్ని ప్రగల్భాలే పలుకుతోందని విమర్శ
- వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించి 15 రోజులు అవుతోందని వ్యాఖ్య
- వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్
వడ్ల కొనుగోళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణ సర్కారు అన్ని ప్రగల్భాలే పలుకుతోందని అందులో పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించి 15 రోజులు అవుతోందని, ఇప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించారు. వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న తనకు అనేక మంది రైతులు పలు విషయాలు చెప్పారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారని ఆయన పేర్కొన్నారు. గద్వాల్ జిల్లాలో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటిల్లో రెండింటిని మాత్రమే ప్రారంభించారని ఆయన చెప్పారు. అలాగే, వనపర్తి జిల్లాలో 225 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 19, నారాయణపేట్ జిల్లాలో 91 కేంద్రాలకు 70 మాత్రమే ప్రారంభించారని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఏడు వేల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2,500 మాత్రమే తెరిచారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి ఉందని, ఇప్పటి వరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొందని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కారుకి రైతుల సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి ఏంటో దీని ద్వారా తెలిసిపోతోందని ఆయన అన్నారు. రైతుల తరఫున బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.