పాఠశాల భవనంలో వైసీపీ ఎమ్మెల్యే.. రౌండప్ చేసిన గ్రామస్తులు: జి.కొత్తపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
- జి.కొత్తపల్లి వైసీపీ అధ్యక్షుడి దారుణ హత్య
- బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారి
- వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ శ్రేణులే దాడికి దిగిన వైనం
- పాఠశాల భవనంలోకి ఎమ్మెల్యేను పంపి కాపలా కాస్తున్న పోలీసులు
- పాఠశాల భవనాన్ని చుట్టుముట్టిన గ్రామస్తులు
- అదనపు బలగాలతో జిల్లా ఎస్పీ గ్రామానికి పయనం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ గ్రామ సర్పంచ్ గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురి కాగా... ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై వైసీసీ శ్రేణులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. అతి కష్టం మీద గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను తప్పించిన పోలీసులు..ఆయనను అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఉంచారు. అయితే ఆ పాఠశాల భవనాన్ని రౌండప్ చేసిన గ్రామస్తులు ఎమ్మెల్యేను వదిలిపెట్టేది లేదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
పాఠశాల భవనం లోపల ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఆ భవనం చుట్టూ వైసీపీ శ్రేణులు... వారి మధ్య పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో గడచిన మూడు గంటలుగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అదనపు బలగాలను తీసుకుని గ్రామానికి బయలుదేరారు. అదనపు బలగాలు అక్కడికి చేరుకుంటే తప్పించి ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షితంగా తరలించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరి అదనపు బలగాలు అక్కడికి చేరుకున్న తర్వాత గ్రామంలో ఇంకెంత మేర ఉద్రిక్తత నెలకొంటుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.