కోర్టుల్లో స్థానిక భాష‌ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి... సీఎంలు, హైకోర్టు సీజేల స‌ద‌స్సులో మోదీ

  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో న్యాయ వ్య‌వ‌స్థ పాత్ర కీల‌కం
  • న్యాయ శాఖలో ఖాళీల భ‌ర్తీకి చ‌ర్య‌లు
  • డిజిట‌ల్ ఇండియా ప్ర‌గతిలో కలిసి రావాల‌ని సీఎంల‌కు మోదీ పిలుపు
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ల‌ స‌మావేశం ఢిల్లీలో శ‌నివారం ఉద‌యం ప్రారంభ‌మైంది. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ప్రారంభించిన ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌సంగం చేశారు. కోర్టుల్లో స్థానిక భాష‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని మోదీ పిలుపునిచ్చారు. 

డిజిట‌ల్ ఇండియా ప్ర‌గ‌తిలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల సీజేలు త‌మ‌తో క‌లిసి రావాల‌ని ప్ర‌ధాని మోదీ కోరారు. న్యాయ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఆయ‌న చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో న్యాయ వ్య‌వ‌స్థ‌ పాత్ర కీల‌క‌మ‌ని మోదీ పేర్కొన్నారు. దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు అసంభ‌వ‌మ‌ని కొంద‌రు అన్నార‌న్న మోదీ... నేడు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుగుతున్న దేశంగా భారత్ నిలిచింద‌ని తెలిపారు.


More Telugu News