అడగకుండానే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసి.. ఆపై వేధిస్తోన్న రుణయాప్‌లు
- కొత్త పంథాలో వెళ్తున్న రుణయాప్‌లు
- ఇటీవల పెరిగిపోయిన కేసులు
- పోలీసులకు చిక్కకుండా 2 దేశాల నుంచి యాప్‌ల నిర్వహణ
యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ అప్పు తీసుకున్న వారిని వేధింపులకు గురి చేస్తోన్న చైనా రుణ యాప్ ల నిర్వాహకులు ఇప్పుడు కొత్త పంథాలో వెళ్తున్నారు. యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాల్లో అడగకుండానే డబ్బులు వేస్తున్నారు. ఆ తర్వాత వడ్డీ కట్టాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు, పోలీసులకు చిక్కకుండా వారు ఇప్పుడు రెండు పొరుగు దేశాల నుంచి ఆ యాప్‌లను నిర్వహిస్తున్నారు.
తమ యాప్‌ల ద్వారా గతంలో రుణాలు తీసుకున్నవారి వివరాలను సేకరించి, మరిన్ని రుణాలు తీసుకోండని ఆఫర్‌లు ప్రకటిస్తున్నారు. దాదాపు 4.5 లక్షల మంది వివరాలు తీసుకుని మళ్లీ రుణాలు తీసుకోండని వారికి మెసేజ్‌లు పంపుతున్నారు. మెసేజ్‌లకు స్పందించిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు వేస్తున్నారు.
తమ మెసేజ్‌లకు స్పందించని వారి ఖాతాల్లో కూడా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వారి అంగీకారం లేకుండా డబ్బులు వేస్తున్నారు. ఈ తతంగాన్నంతా నడపడానికి ఒక కార్పొరేట్ బ్యాంక్ లో వర్చువల్ ఖాతాలను తెరిచారు. గత రెండు నెలల్లో ఆ యాప్‌ల నిర్వాహకులు దాదాపు 75 వేలమందికి రుణాలు ఇచ్చారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
మూడు నెలల క్రితం రెండు దేశాలకు చైనీయులు వెళ్లి, అక్కడి నుంచి రుణ యాప్ లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈ కేసుల్లో మరిన్ని సాక్ష్యాల కోసం అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఆ యాప్‌ల నిందితుల ఆచూకీ లభిస్తే ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేస్తామని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అడగకుండానే రుణ యాప్‌ల వినియోగదారుల ఖాతాల్లో డబ్బులు పడుతోన్న ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఓ నర్సింగ్ విద్యార్థిని బ్యాంకు ఖాతాలో అడగకుండానే కొన్ని రోజుల క్రితం రుణయాప్ సంస్థలు రూ.50 వేలు వేశాయి. రెండు రోజుల తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.80 వేలు వారం రోజుల్లోపు చెల్లించాలని హెచ్చరించాడు. తాను అడగకుండానే డబ్బులు పడ్డాయని, తాను కట్టబోనని ఆమె తెలిపింది. దీంతో ఆమె ఫోటోలను నగ్నంగా మార్చి ఆమె స్నేహితులకు రుణయాప్ నిర్వాహకులు పంపారు. హైదరాబాద్‌లో మరి కొందరికీ ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి.