టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం జేడీ గోయల్ పదవీకాలాన్ని పొడిగించిన ఈడీ
- డ్రగ్స్ కేసును పర్యవేక్షిస్తున్న గోయల్
- ఎక్సైజ్ శాఖ నుంచి ఆధారాలన్నీ సేకరించిన జేడీ
- కేసు దర్యాప్తులో ఆటకం కలగరాదన్న భావనతో గోయల్ సర్వీస్ పొడిగింపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... కేసు దర్యాప్తు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సంస్థ జాయింట్ డైరెక్టర్ గోయల్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టిన నాటి నుంచి గోయలే దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
కేసుకు సంబంధించిన నిందితుల వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవడంలో గోయల్ కీలక భూమిక పోషించారు. ఎక్సైజ్ శాఖ నుంచి సకాలంలో వివరాలు అందని నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గోయల్... కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నుంచి దాదాపుగా పూర్తి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే కేసు దర్యాప్తులో ఆటంకం కలగకూడదన్న భావనతో గోయల్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది.