రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షపై స్పందించిన ఏపీ హోం మంత్రి
- తీర్పు చరిత్రాత్మకమైనది
- ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ తరహా కేసుల విచారణలో వేగం
- ఈ తీర్పు స్ఫూర్తితో మహిళలపై నేరాల్లో విచారణ
- మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్న వనిత
గుంటూరు నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థి రమ్యను హత్య చేసిన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ గుంటూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత తాజాగా స్పందించారు. ఈ తీర్పును చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించిన వనిత... ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఇలాంటి కేసుల విచారణ వేగంగా జరుగుతుందని తెలిపారు.
రమ్య హంతకుడికి ఉరి శిక్ష విధిస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన హోం మంత్రి... దిశ చట్టం స్ఫూర్తితోనే ఈ కేసు దర్యాప్తు సాగిందని చెప్పారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన విచారణ ఉంటుందని ఆమె చెప్పారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తానేటి వనిత తెలిపారు.