కేటీఆర్ నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది: ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని
- బలహీన వర్గాల ప్రజలు ఏపీకి రావాలని చూస్తున్నారు
- కరోనా చికిత్స కోసం తెలంగాణ ప్రజలు ఏపీకి వచ్చారు
- కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ ఒట్టి మాటలేనన్న పేర్ని
పొరుగు రాష్ట్రంలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) ఫైరయ్యారు. ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యలపై శుక్రవారం రాత్రి స్పందించిన నాని... పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ "కేటిఆర్ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిది. జగన్ మా సీఎం అయితే బాగుండునని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. బలహీన వర్గాల ప్రజలు ఏపీకి రావాలని చూస్తున్నారు. కరోనా చికిత్స కోసం తెలంగాణ ప్రజలు ఏపీకి వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పేవన్నీ ఒట్టి మాటలే" అని వ్యాఖ్యానించారు.