పోస్టింగ్ కోసం ఏపీ స‌చివాల‌యానికి వచ్చిన‌ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

  • ఏబీపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన జ‌గ‌న్ స‌ర్కారు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు
  • త‌క్ష‌ణ‌మే ఏబీకి పోస్టింగ్ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశం
  • కాసేప‌ట్లో సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌తో భేటీ కానున్న సీనియ‌ర్ ఐపీఎస్‌
ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు శుక్ర‌వారం నాడు అమ‌రావ‌తిలోని ఏపీ స‌చివాల‌యానికి వ‌చ్చారు. త‌న‌కు పోస్టింగ్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌ను కోరేందుకే ఆయ‌న స‌చివాల‌యానికి వ‌చ్చారు. మ‌రి కాసేప‌ట్లో ఆయ‌న సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌తో భేటీ కానున్నారు.

టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిఘా ప‌రిక‌రాల కొనుగోలుకు సంబంధించి అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపించిన జ‌గ‌న్ స‌ర్కారు... దానికి బాధ్యుడిగా గుర్తిస్తూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై స‌స్పెన్ష‌న్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌స్పెన్ష‌న్‌ను స‌వాల్ చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించగా.. ఐపీఎస్‌ల‌పై రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్ విధించే అవ‌కాశాలు లేవ‌న్న కోర్టు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు త‌క్ష‌ణ‌మే పోస్టింగ్ ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు పోస్టింగ్ ఇవ్వాల‌ని కోరేందుకే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌చివాల‌యానికి వ‌చ్చారు.


More Telugu News