రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్షపై సీఎం జగన్ స్పందన

  • గతేడాది గుంటూరులో దారుణ హత్య
  • బీటెక్ విద్యార్థిని రమ్యను పొడిచి చంపిన శశికృష్ణ
  • దోషిగా నిర్ధారించిన స్పెషల్ కోర్టు
  • శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ నేడు తీర్పు 
  • తీర్పును స్వాగతిస్తున్నట్టు సీఎం జగన్ ట్వీట్
గత సంవత్సరం గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురికాగా, నిందితుడు శశికృష్ణను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్న భావన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది. 

కాగా, కోర్టు తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నానని వెల్లడించారు. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసిందని కితాబిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.


More Telugu News