బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో?... ఏపీ మంత్రికి టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్!
- హైదరాబాద్‌లో రెండు నిమిషాలు కూడా కరెంట్ పోదు
- హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న జగన్ ఫ్యామిలీని అడిగితే తెలుస్తుంది
- హైదరాబాద్‌లోనూ వైసీపీ నేతల కుటుంబాల నివాసమన్న రంజిత్ రెడ్డి
ఏపీలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ పరోక్షంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే... ఆయన కామెంట్లకు కౌంటరిస్తూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లో కరెంట్ లేక జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మీడియాతో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... "తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో. అందుకే కట్ చేశారు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు.