కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి స్పంద‌న‌

  • సింగ‌రేణి కార‌ణంగానే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవు
  • ఏపీలోనూ విద్యుత్ కోత‌లు లేవు
  • రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కేటీఆర్ వ్యాఖ్య‌లు
  • తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు
  • ఓట్ల కోస‌మే ఈ వ్యాఖ్య‌లు అన్న పెద్దిరెడ్డి
ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు. 

ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ "తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ వ్యాఖ్య‌లు. బొగ్గును ఎక్కువ‌ ధ‌ర‌కు కొన‌డానికైనా సిద్ధం. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించాం. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఎవ‌రో ఒక‌ర్ని కించ‌ప‌రిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని విమ‌ర్శించారు" అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 


More Telugu News