కేటీఆర్‌కు ఎవరో స్నేహితుడు చెప్పాడేమో.. నేను నిన్నటిదాకా హైదరాబాద్‌లోనే ఉన్నా: బొత్స సత్యనారాయణ
- హైదరాబాద్‌లో కరెంట్ లేక జనరేటర్‌పై ఉండాల్సి వచ్చింది
- కేటీఆర్ మాటలను నేను ఆక్షేపిస్తున్నాను
- మీ దగ్గర జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవచ్చు
- కానీ పక్క రాష్ట్రాలను విమర్శించవద్దు
- కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న బొత్స
ఏపీలో మౌలిక వసతులు లేవంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీకి చెందిన నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీ గురించి కేటీఆర్ ప్రత్యక్షంగా ఏమీ చూడకుండానే ఆయన స్నేహితుడు చెప్పిన మాటలు నిజమని నమ్మి ఆయన వ్యాఖ్యలు చేశారన్న బొత్స... తెలంగాణలో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినా తాను ఎవరికి చెప్పుకోవడం లేదు కదా అంటూ స్పందించారు. తమ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవచ్చు గానీ పొరుగు రాష్ట్రాలను విమర్శించరాదంటూ బొత్స అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ "ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవరో స్నేహితుడు ఫోన్ చేశాడేమో. నేను నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్నా. కరెంట్ లేక జనరేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఇది నేనెవరితోనూ చెప్పలేదు కదా. కేటీఆర్ మాటలను నేను ఆక్షేపిస్తున్నాను. బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడకూడదు. మీ దగ్గర జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాలను విమర్శించవద్దు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి" అని బొత్స వ్యాఖ్యానించారు.