మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన బీజేపీ కార్యకర్తలు
- హైదరాబాద్ వచ్చిన నితిన్ గడ్కరీ
- జాతీయ రహదారులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి
- ఆ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుండగా గందరగోళం
జాతీయ రహదారులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆ సమావేశంలో గందరగోళం నెలకొంది. చివరకు కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేయడంతో ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.
కాగా, అంతకుముందు హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తయిన రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. అలాగే, ఏడు సీఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు.