సంగారెడ్డి హెటెరో ల్యాబ్స్ ఆవరణలోకి చిరుతపులి.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
- బుధవారం అర్ధరాత్రి సంచారం
- అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన కంపెనీ
- ప్లాంట్ కు చేరుకున్న బృందం
హైదరాబాద్ పరిసరాల్లో మరోసారి చిరుతపులి కనిపించడం స్థానికులను గజగజ వణికిస్తోంది. సంగారెడ్డిలోని గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెటెరో ల్యాబ్స్ ప్లాంట్ ఆవరణలోకి చిరుతపులి ఒకటి ప్రవేశించింది. కంపెనీ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు దీన్ని రికార్డు చేశాయి. బుధవారం అర్ధరాత్రి ఇది జరిగింది. దీన్ని చూసి ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.
చిరుతపులి కదలికల సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు హెటెరో ల్యాబ్స్ తెలియజేసింది. దీంతో అటవీ అధికారులు, సిబ్బందితో కూడిన బృందం హెటోరో ల్యాబ్స్ ప్లాంట్ కు చేరుకుంది. చిరుతపులిని బంధించే చర్యలు ప్రారంభించింది. గతంలోనూ హైదరాబాద్ పరిసరాల్లో చిరుతపులుల సంచారం ఎన్నో సార్లు వెలుగుచూసింది. రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి పలు సందర్భాల్లో కనిపించినా కానీ, అటవీ అధికారులకు చిక్కకుండా అది తప్పించుకుని పోయింది. వీడియో