అక్ర‌మ గ్రానైట్ మైనింగ్‌పై సీఎస్‌కు లేఖ రాసిన‌ చంద్ర‌బాబు

  • చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో మైనింగ్ గురించి ప్ర‌స్తావ‌న‌
  • జాతీయ‌ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసిన చంద్ర‌బాబు
  • ఆదేశాల‌ను వెంట‌నే అమలు చేయాల‌ని లేఖ‌
త‌న నియోజ‌క వ‌ర్గం కుప్పంలో అక్ర‌మ గ్రానైట్ మైనింగ్‌ జ‌రుగుతోంద‌ని, దీన్ని అరిక‌ట్టాల‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నంబరు 104తో పాటు 213లో అక్రమ మైనింగ్‌పై జాతీయ‌ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను చంద్ర‌బాబునాయుడు జతచేస్తూ ఏపీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 

ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల‌ను వెంట‌నే అమలు చేయాల‌ని ఆయ‌న కోరారు. ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్ధారించిదని ఆయ‌న గుర్తు చేశారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ వారి వివరాల‌ను తెలపాల‌ని ఎన్జీటి తెలిపింద‌ని ఆయ‌న అన్నారు. అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ప్రాంతాన్ని పరిశీలించి మైనింగ్‌పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.


More Telugu News