వైయస్ మృతి వెనుక జగన్ హస్తముందని బొత్స చెప్పిన వార్తను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించిన అయ్యన్నపాత్రుడు

  • నిన్న నారా లోకేశ్ పై రాళ్లు రువ్విన వైసీపీ కార్యకర్తలు
  • కడుపు మండిన వాళ్లు దాడి చేశారేమో అన్న బొత్స
  • నీలాంటి వాళ్లపై దాడి జరిగితే కడుపు మంట అనుకోవడంలో తప్పు లేదన్న అయ్యన్న
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేశ్ పై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ఏమీ కాకపోయినా... ఇద్దరు పోలీసులకు మాత్రం గాయాలయ్యాయి. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ... లోకేశ్ పై దాడి చేసింది. వైసీపీ కార్యకర్తలో, కడుపు మండిన వాళ్లో ఎవరికి తెలుసని ఎద్దేవా చేశారు. చిల్లరగా ఉంటే... చిల్లరగానే ఉంటుందని చెప్పారు. 

బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. వైయస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని 2012లో బొత్స చేసిన వ్యాఖ్యల తాలూకు పేపర్ క్లిప్పింగ్ ను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విమర్శలను లేవనెత్తారు. 

'వైయస్ మృతి వెనుక జగన్ హస్తం ఉంది. వైయస్ విజయలక్ష్మి, జగన్ తీరు దొంగే... దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ నీ అంత డిగ్నిఫైడ్ గా మాట్లాడటం మా లోకేశ్ కి రాదు బొత్స సత్తిబాబు. సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం అని చిల్లరగా మాట్లాడి మంత్రిగా ఫెయిల్ అయిన నీలాంటి వాళ్లపై దాడులు జరిగితే కడుపు మంట అనుకోవడంలో తప్పు లేదు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేశ్ ని చూసి అక్కసుతో గ్యాస్ ఎక్కువై జగన్ రెడ్డి పంపిన రౌడీలు రాళ్లు విసిరితే కడుపుమండి ఎవరో చేశారని కవరింగ్ ఎందుకు బొత్సా?' అని విమర్శలు గుప్పించారు.


More Telugu News