లీడర్‌షిప్ ఫార్ములాలో రాహుల్, ప్రియాంక గాంధీలు లేరు: ప్రశాంత్ కిషోర్
- మూడో వ్యక్తి గురించి చర్చ జరగలేదన్న పీకే
- కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని స్పష్టీకరణ
- ఆ పార్టీకి పీకేలాంటి వాళ్ల అవసరం లేదన్న ప్రశాంత్ కిషోర్
కాంగ్రెస్ పార్టీకి తానిచ్చిన లీడర్‌షిప్ ఫార్ములాలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పేర్లు కానీ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ‘ఆజ్‌తక్’ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో మరి మూడోపేరు ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు.. దానిగురించి ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి పీకే లాంటి వాళ్ల అవసరం లేదని, ఆ పార్టీ నిర్ణయాలను తీసుకోగలదని అన్నారు.
‘‘మీడియా నన్ను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోంది. నా స్థాయి అంత పెద్దది కాదు. రాహుల్ గాంధీ నాపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాంగ్రెస్‌కు పీకే అవసరం లేదు. అది తన సొంత నిర్ణయాలను తీసుకోగలదు’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు తాను చెప్పాలనుకున్నది చెప్పానని, అలా ముందుకెళ్లాలా? వద్దా? అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పీకే వివరించారు.