ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి, వాటిల్లో బాగా ఆడాల్సి ఉంది: కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్‌

  • ఈ మ్యాచ్‌ను పేలవంగా ప్రారంభించాం
  • ఆదిలోనే వికెట్లు కోల్పోయాం 
  • ఓటమికి ప్ర‌త్యేకంగా కారణాలేమీ లేవు
  • తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి
ఐపీఎల్‌లో భాగంగా గ‌త రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్ మాట్లాడుతూ... తాము ఈ మ్యాచ్‌ను పేలవంగా ప్రారంభించామ‌ని చెప్పాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోయామ‌ని, పిచ్‌ నెమ్మదిగా ఉన్నప్ప‌టికీ త‌గినన్ని పరుగులు చేయలేకపోయామ‌ని తెలిపాడు. 

త‌మ‌ ఓటమికి ప్ర‌త్యేకంగా కారణాలేమీ లేవని, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలని అన్నాడు. త‌మ‌ టాప్ ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇక‌పై త‌మ జ‌ట్టు భయం వీడి దూకుడుగా ఆడాల్సి ఉంద‌ని అభిప్రాయ‌పడ్డాడు. ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్నాయని, వాటిల్లో బాగా ఆడాలని చెప్పాడు. 

త‌మ టీమ్‌లో విశ్వాసం కలిగించి యాజమాన్యం నమ్మకాల్ని నిలబెట్టుకోవాలని చెప్పాడు. ఓట‌మి గురించి ఆలోచించకుండా ఇకపై గెలవడానికి కృషిచేయాలని చెప్పాడు. ఉమేశ్‌ తొలి ఓవర్ లోనే వికెట్‌ తీసినప్ప‌టికీ, 11 పరుగులిచ్చాడని, అక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయిందని ఆయ‌న అన్నాడు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఉమేశ్ త‌మ‌కు మంచి శుభారంభాలు అందించాడని తెలిపాడు.


More Telugu News