ప్యాసింజర్ రైలు పోయి.. బొగ్గు రైలు వచ్చే..!
- బొగ్గు రవాణాకు అధిక ప్రాధాన్యం
- ప్రయాణికుల రైళ్లు తగ్గిస్తున్న రైల్వే
- విద్యుత్ ప్లాంట్లలో పడిపోయిన బొగ్గు నిల్వలు
- విద్యుత్ సంక్షోభం రాకుండా రైల్వే సాయం
భారతీయ రైల్వే ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. దీనివల్ల థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. విద్యుత్ సంక్షోభం రాకూడదంటే థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పక్కాగా ఉండాలి. ఈ పరిణామాలు ప్రయాణికుల రైళ్లకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రయాణికుల రైళ్లను తగ్గించి వాటి స్థానంలో బొగ్గును తీసుకునిపోయే గూడ్స్ రైళ్లకు రైల్వే మార్గం కల్పిస్తోంది.
ఫలితంగా గత కొన్ని వారాల్లో భారతీయ రైల్వే 16 మెయిల్/ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మే 24 వరకు మొత్తం మీద 670 ట్రిప్పుల రైలు సర్వీసులను నిలిపివేస్తూ రైల్వే శాఖ నోటిఫై కూడా చేసింది. ఇందులో 500 వరకు దూర ప్రాంతాల మధ్య నడిచే మెయిల్, ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులే కావడం గమనార్హం.
రోజువారీ బొగ్గు లోడింగ్ ర్యాక్ లను 400కు పైగా రైల్వే శాఖ పెంచింది. గత ఐదేళ్లలో రోజు వారీగా ఇన్నేసి బొగ్గుర్యాక్ ల రవాణా ఇదే మొదటిసారి. బొగ్గు రవాణాకు రైల్వే రోజువారీగా మొత్తం 415 ర్యాక్ లను కేటాయించింది. ఇవి 3,500 టన్నుల బొగ్గును రవాణా చేయగలవు. విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెరిగే వరకు.. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.