ఎలుకల నుంచే ఒమిక్రాన్: అమెరికా పరిశోధకులు

  • ఉత్పరివర్తనాల వల్ల ఒమిక్రాన్ పుట్టలేదు!
  • జంతువుల్లో వేల సంఖ్యలో కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు
  • ప్రాణాంతక వేరియంట్‌గా మారేందుకు అత్యధిక అవకాశాలున్నాయన్న శాస్త్రవేత్తలు
  • జంతువులు కొత్త వేరియంట్లకు రిజర్వాయర్లుగా ఉంటాయంటున్న నిపుణులు
కరోనా మూడో దశలో ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందన్న ప్రశ్నకు అమెరికా పరిశోధకులు తాజాగా వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తిలో ఉత్పరివర్తనాల వల్ల పుట్టుకొచ్చింది కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎలుకల నుంచే బహుశా ఇది మానవుల్లో ప్రవేశించి ఉండొచ్చని అన్నారు.

జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, అత్యంత ప్రాణాంతక వేరియంట్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. కరోనా వ్యాప్తిలో జంతువుల పాత్రను విస్మరించడానికి లేదని, అవి కొత్త వేరియంట్లకు రిజర్వాయర్లుగా పనిచేస్తాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు.


More Telugu News