పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్... భారీగా దుంగలను పట్టేసిన పోలీసులు
- చిత్తూరు టూ మలేషియా వయా తూత్తుకుడి
- కంటైనర్లలో ఎర్రచందనం తరలింపు
- తూత్తుకుడిలో ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- రూ.12 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం, కంటైనర్ సీజ్
ఇటీవలే విడుదలై సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ సినిమా పుష్ప తరహాలో ఎర్రచందనాన్ని దేశం సరిహద్దులు దాటిస్తున్న ఓ ముఠాను తమిళనాడు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చిత్తూరు నుంచి మలేసియాకు ఎర్రచందనాన్ని తరలించేందుకు యత్నించిన స్మగ్లర్లు తూత్తుకుడిని తమ కీలక కేంద్రంగా మార్చుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు అప్రమత్తం చేయడంతో ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారంతో తమిళనాడులోని తూత్తుకుడిలో మాటు వేసిన తమిళనాడు పోలీసులు... ఎర్రచందనం దుంగల లోడుతో వచ్చిన కంటైనర్‌ను ఆపారు. తనిఖీల్లో భాగంగా కంటైనర్‌లో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు...కంటైనర్‌ను సీజ్ చేశారు. కంటైనర్‌లోని రూ.12 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.